హస్తినకు చేరిన కూటమి లొల్లి..!

207
mahakutami
- Advertisement -

ప్రజాకూటమి పొత్తులపై మహా చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ, సీపీఐ,టీజేఎస్‌..కాంగ్రెస్‌తో కలిసి ప్రజాకూటమిగా ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. పొత్తు అయితే పొడిచింది కానీ సీట్ల పంపకాలే ఇంకా ఖరారు కాలేదు. పలుదఫాలుగా పోటీ చేసే
స్ధానాలపై చర్చలు జరుగుతున్నా ఏకాభిప్రాయానికి మాత్రం రాలేక పోతున్నారు కూటమి నేతలు.

ఇక కాంగ్రెస్‌తో పొత్తు వెంటిలెటర్‌పై ఉన్న టీడీపీ అనివార్యం. దీంతో ఆ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే చెప్పేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. కానీ టీజేఎస్,సీపీఐ మాత్రం తాము కోరిన స్ధానాలు ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. టీజేఎస్ 20,సీపీఐ 9 సీట్లు అడుగుతుండగా అన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. దీంతో ప్రజాకూటమిలో సీట్ల పంపకాల పీటముడి వీడటం
లేదు.

ఈ నేపథ్యంలో కూటమి పంచాయతీ ఢిల్లీకి చేరింది. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగే కీలక భేటీలో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా.. టీజేఎస్ అధినేత కోదండరాం సైతం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు  ..రాహుల్‌ను కలిసి టీడీపీ సీట్ల విషయంపై మాట్లాడే అవకాశాలున్నాయి. ఓ వైపు నామినేషన్లకు గడువు సమీపిస్తున్న ఇంకా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడం మహాకూటమికి మైనస్‌గానే చెప్పుకొవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -