ఆరో దశ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు..

282
cricketer Virat Kohli
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మాక ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్‌ ముగియనుంది. ఏడు రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఆరో దశ పోలింగ్‌లో మొత్తంగా 979 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇప్పటికే పలువురు ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ, బీజేపీ భోపాల్‌ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌, మాజీ క్రికెటర్‌, దిల్లీ తూర్పు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

భారత రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ తన ఓటు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ న్యూఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి అజయ్‌ మాకెన్‌ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నాయకురాలు షీలా దీక్షిత్‌.. నిజాముద్దీన్‌ ఈస్ట్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటేశారు. ఈసారి ఎన్నికల్లో ఆమె దిల్లీ ఈశాన్యం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాష్ట్రంలోని కర్నాల్‌ పట్టణంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆయన సతీమణి సీమాతో కలిసి పాండవ్‌ నగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- Advertisement -