బరిలో నిలిచిన బడా నేతలు వీరే..

46
Lok Sabha election

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎలక్షన్‌లో మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 979 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7, హరియాణాలో 10, ఝార్ఖండ్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 8, బీహార్‌లో 8, ఉత్తరప్రదేశ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది.

Lok Sabha election

ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్‌, హర్షవర్ధన్‌, మేనకాగాంధీ, నరేంద్రసింగ్‌ తోమర్‌, రావు ఇంద్రజీత్‌సింగ్‌, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్‌యాదవ్‌, కాంగ్రెస్‌నేత దిగ్విజయ్‌సింగ్‌, భూపీందర్‌సింగ్‌ హుడా, జ్యోతిరాదిత్య సింధియా, షీలాదీక్షిత్‌, క్రీడాకారులు విజేందర్‌సింగ్‌, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తదితరులు నేటి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఈ పోలింగ్‌ ఉదయం ఏడు గంటలకు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది.