నన్ను వదిలేయండి బాబు….

244
Live me alone :Big-b
- Advertisement -

భారతీయ సినిమాకు అమితాబ్ బచ్చన్ ట్రెండ్ సెట్టర్. అమితాబ్ వచ్చాక ఇండియన్ సినిమా ఒక మలుపు తిరిగింది. సినిమా చరిత్రను తీసుకుంటే అమితాబ్ కు ముందు, అమితాబ్ వచ్చిన తర్వాత అని డివైడ్ చేసి డిసైడ్ చేయవచ్చు. బిగ్ బి వచ్చాక బాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ఒక టర్నింగ్ వచ్చింది. బిగ్ బి నటనకు యావత్ దేశం ఫిదా అయిపోయింది.

బాలీవుడ్ రారాజుగా  తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అమితాబ్ ..వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు.  నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పనామా పేపర్స్ లీక్ ఇంకా మరిచిపోకముందే మరో లీక్ కలకలం రేపుతోంది. ప్యారడైజ్ పేపర్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగ్గొట్టిన  నల్లకుబేరుల జాబితా  బయటపడింది.

ఈ జాబితాలో అమితాబ్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రామానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన తర్వాతి సంవత్సరం అమితాబ్ , సిలికాన్ వాలీ వెంచర్ ఇన్వెస్టర్ నవీన్ చద్ద జాల్వా మీడియా లిమిటెడ్ లో జూన్ 19, 2002లో షేర్ హోల్డర్స్ గా ఉన్నట్టు వెల్లడైంది. బెర్ముడాలో 2002లో ప్రారంభమైన ఈ కంపెనీ 2005లో మూతపడినట్టు తెలుస్తోంది.

బెర్ముడా కన్నా ముందు కాలిఫోర్నియాలో నలుగురు భారతీయ పారిశ్రామికవేత్తలు ఇదే కంపెనీని జనవరి, 2000వ సంవత్సరంలో అక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బెర్మడాలోను ఏర్పాటు చేశారు. అయితే ఈ కంపెనీ కేవలం పేపర్స్ మీదనే చలామణి అయిందన్న ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో షేర్ హోల్డర్ గా ఉన్న అమితాబ్ మెడకు ఈ వ్యవహారం చుట్టుకునే అవకాశాలున్నాయి.

అంతేగాదు ఇటీవల ముంబై కార్పొరేషన్  అమితాబ్  గోరేగామ్ ఈస్ట్ లో ఫిలిం సిటీకి సమీపంలో నిర్మించిన బంగళాను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నోటీసులు ఇచ్చారు. దీనికి  తోడు నెస్లే మ్యాగీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం కూడా మరింత చిక్కుల్లో పడేసింది. ప్రస్తుతం 75 సంవత్సరాల వయసున్న అమితాబ్ వరుస వివాదాలతో సతమతమవుతున్నారు.నన్ను వదిలేయండి బాబు అని వేడుకుంటున్నారు.

- Advertisement -