“లిసా” త్రిడి ట్రైలర్ లాంచ్ చేసిన విక్టరీ వెంకటేశ్

51
Lisa Movie Triler

లిసా త్రిడి మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు విక్టరీ వెంకటేశ్. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “అంజలి మంచి ఆర్టిస్టు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ ట్రైలర్ ఆకట్టుకునేలాఉంది సురేష్ కొండేటి కి లిసా యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్” అన్నారు . ఈమూవీలో అంజలి ప్రధాన పాత్రలో నటిస్తుంది. రాజు విశనాధ్ ఈసినిమాకు దర్శకత్వం వహించారు.

ఈచిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇటివలే విడుదలైన ఈచిత్ర టీజర్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈమూవీ విడుదల తేదీని ప్రకటించనున్ననట్లు తెలిపారు చిత్రయూనిట్. ఇక అంజలి మరోసారి దెయ్యం పాత్రలో కనిపించనుంది. అంజలి దెయ్యం పాత్రలో నటించిన గీతాంజలి, చిత్రాంగథ సినిమా మంచి విజయాన్ని సాధించాయి.