సెప్టెంబర్ 17తో బీజేపీ రాజకీయం చేస్తోంది..!

457
kishan rao
- Advertisement -

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 17పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష నాయకులు కిషన్ రెడ్డి సెప్టెంబర్ 17 పైన,టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి చీలుతుంది. దేవుడు కూడా రక్షించలేడు అన్న మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు.

ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను రాజకీయం చేస్తారు కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడాలనే చిత్తశుద్ధి బీజేపీకి లేదు. 1948 రజాకార్ల పోరాటంలో పాల్గొన్న కుటుంబీకులకు బీజేపీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారు స్పందించడం లేదని.. బిజెపి ప్రభుత్వం శ్రీరాముడితో,సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయం చేస్తున్నారని కిషన్‌ రావు ఎద్దేవ చేశారు.

భారతదేశంలో ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఛత్రపతి శివాజీ స్పూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల ,అన్ని మతాల ఆచార వ్యవహారాలను గౌరవించి వారి పండుగలను ప్రభుత్వ పరంగా జరిపిస్తున్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కిషన్‌ రావు తెలిపారు.

- Advertisement -