11న మండలి చైర్మన్ ఎన్నిక..

240

శాసన మండలి బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 11వ తేదీన శాసన మండలి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు మండలి సమావేశాలు జరుగనున్నాయి. అక్టోబర్‌లో రెవెన్యూ బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది.

prasanth reddy

అక్టోబర్‌లో మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు 21 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ నెల 24వ తేదీన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కానిస్టిట్యూషనల్ క్లబ్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.