సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య..!

197
lavanya tripati

తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సినీ నటి లావణ్య త్రిపాఠి. సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నట్లు యూ ట్యూడ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని  మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లావణ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ యూట్యూబ్‌ ఛానెల్స్‌లో సునిశిత్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలించామని తెలిపారు. సునిశిత్‌….లావణ్యతో పాటే ఇతర సెలబ్రిటీలపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని…అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుతం లావణ్య… సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ్‌లో అథర్వ మురళి హీరోగా నూతన దర్శకుడు రవీంద్ర మాధవ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.