డిస్కోరాజా లుక్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌..

148

టాలీవుడ్‌ మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే, రవితేజ పాత్రకు సంబంధించిన కొత్త గెటప్ అంటూ ప్రస్తుతం ఓ ఫోటో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ వ్యక్తితో రవితేజ సెల్ఫీ చూస్తే ఎంతో ఆశ్చర్యపోతారు. చూడగానే మాంచి యవ్వనంలో ఉన్న రవితేజలా కనిపిస్తాడు. అయితే ఈ లుక్‌పై ద‌ర్శ‌కుడు ఆనంద్ తన ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Disco Raja

 

రవితేజ కొత్త లుక్ అంటూ సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వం. డిస్కోరాజా చిత్ర బృందంఈ ఫోటోని ఎక్క‌డ ప్ర‌మోట్ చేయ‌లేదు. అతి త్వ‌ర‌లో ర‌వితేజ లుక్‌కి సంబంధించిన ఫోటోని విడుద‌ల చేస్తాం. అంత‌వ‌ర‌కు ఇలాంటి వార్త‌లు స‌ర్క్యులేట్ చేయవ‌ద్దు అని ఆనంద్ పేర్కొన్నారు .

ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త.