స్కూల్ అసిస్టెంట్లుగా భాషా పండితులు..

164
Language Pandit
- Advertisement -

పదోన్నతులలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పోస్టులకు భాషా పండితులను మాత్రమే అర్హులుగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం 1,2 తేదీ 5.02.2021 విడుదల చేసింది. ఆమేరకు 2009లో విడుదలైన అడ్హాక్ సర్వీసు రూల్స్ జిఓలు 11,12 లను సవరించింది. ఇక నుండి ఎస్ఏ తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, తమిళ్, కన్నడ, ఒరియా, మరాఠి, గుజరాతి, బెంగాలీ, అరబిక్ పోస్టుల్లో ఆయా భాషలకు సంబంధించిన భాషా పండితులందరికీ విద్యార్హతలు, సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తారు. ఇతర సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్జీటీలు, పిఈటిలు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ తదితర ఉపాధ్యాయులకు అర్హతలు, సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తారు.

- Advertisement -