పవర్ స్టార్ మూవీలో ఖుష్బూ..!

225
Kushboo to joine pawan movie..!
- Advertisement -

‘స‌ర్దార్ గబ్బ‌ర్‌సింగ్’ లాంటి డిజాస్ట‌ర్ మూవీ త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘కాట‌మ‌రాయుడు’. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్‌మ‌రార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వం ఎప్పుడో ప్రారంభ‌మైంది. అయితే ప‌వ‌న్ ఇటు పొలిటిక‌ల్‌గా ప్ర‌త్యేక హోదాపై పోరాటం చేస్తుండ‌టంతో ‘కాట‌మ‌రాయుడు’ షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతోంది. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు పవన్ కమిట్ అయ్యారు.

ఇప్పటికే పవన్ కోసం త్రివిక్రమ్ సాలిడ్ కథను సిద్ధం చేస్తున్నాడట. ”జల్సా” , ”అత్తారింటికి దారేది” సినిమాల తరువాత పవన్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని హారికా హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ ఉందట. ఇందులో నాటి గ్లామర్ హీరోయిన్ ఖుష్బూ నటించనుందట. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని… ఆ పాత్రలో ఖుష్బూ ను నటింప చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Kushboo to join Pawan movie..!

అయితే ఖుష్బూ నటించేది ఏ పాత్రలో అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. ఇప్పటికే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నదియా అత్త పాత్రలో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఖుష్భు కూడా కీలక పాత్రలో నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా ఈ నెల రెండో వారంలో సెట్స్ పైకి రానుందట. ఇటీవ‌లి కాలంలో ఖుష్బూ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ కోరిక మేర‌కు ప‌వ‌న్‌ సినిమాలో న‌టించేందుకు అంగీక‌రించార‌ని తెలుస్తోంది.

ఈ చిత్రానికి ‘దేవుడు దిగి వచ్చిన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.”జల్సా”, ”అత్తారింటికి దారేది” సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, వారి ఎంపిక ఇంకా జరగలేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -