కేటీఆర్…..మిలియన్ థ్యాంక్స్

199
KTR Twitte Million followers
- Advertisement -

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తనదైన శైలిలో ముందుకెళ్తున్న మంత్రి కేటీఆర్, తన నియోజకవర్గ ప్రజలకు ఏచిన్న కష్టమొచ్చినా అండగా నిలుస్తున్నారు. తన వద్దకు వచ్చే అభాగ్యులకు తానున్నాంటూ భరోసా ఇస్తూనే.. ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు నెటిజన్ల విజ్ఞపులపై స్పందించడంలో.. సాయం చేయడంలో కేటీఆర్ ఎప్పుడూ ముందే ఉంటారు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో కేటీఆర్‌ని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ 10 లక్షలు దాటింది. ఈ సందర్భంగా మినిస్టర్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తనను ఫాలో అవుతున్న నెటిజన్లందరికీ మిలియన్ థ్యాంక్స్ చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలో కానీ, దేశ, విదేశాల్లో ఎక్కడికి పోయినా తను చేస్తున్న ప్రతి పనిని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియబరుస్తున్నారు.

రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి పనులను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. ప్రభుత్వ పనితీరును తెలియజేస్తున్నారు. అంతేకాదు.. ట్విట్టర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆ సమస్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కేటీఆర్ ట్విట్టర్ ఖాతా 10 లక్షలకు చేరడంపై పలువురు మంత్రులతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -