చిన్నారి వైద్యానికి మంత్రి కేటీఆర్ సాయం..

209
- Advertisement -

మంత్రి కేటీఆర్‌ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే  ఆపదలో ఉన్నామని, తమను ఆదుకోవాలని పలువురు మంత్రి కేటీఆర్‌ను సంప్రదించగా మానవతా దృక్పథంతో వారికి సహాయాన్ని అందించిన మంత్రి కేటీఆర్‌ తాజాగా మరో చిన్నారి వైద్య ఖర్చులకు సాయమందించి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన ఆడెపు శ్రీధర్‌ అనే వ్యక్తి తన కూతురు వింత వ్యాధితో బాధపడుతోందని, తమ చిన్నారి వైద్య ఖర్చులకు సాయమందించాలని మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌ లో వేడుకున్నారు.

minister ktr

వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలోని తన కార్యాలయంలో సంప్రదించాలని రీ ట్విట్ చేశారు.  అనంతరం దవాఖానకు అయ్యే ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ 1.50 లక్షలు మంజూరి చేస్తున్నట్లు అనుమతి పత్రాలను దవాఖానకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వర్నిక గురించి ట్వీట్ చేసి చిన్నారికి సహకారం అందించాలనీ అధికారులకు మంత్రి సమాచారం అందించారు.. ట్వీటర్‌కు స్పందించి తన కుతూరి ఆరోగ్య వైద్య ఖర్చులకు సహకరించిన మంత్రి కేటీఆర్‌కు వర్నిక తండ్రి శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

minister ktr

- Advertisement -