ముత్యం రెడ్డి భౌతికకాయానికి కేటీఆర్‌ నివాళి..

260
ktr

సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని చెరుకు ముత్యంరెడ్డి భౌతికకాయానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఆయన ముత్యంరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణ రెడ్డి, క్రాంతికుమార్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బాలమల్లు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ktr

 

ఈ సందర్బంగా కేటీఆర్‌ ముత్యంరెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన మృతి బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితమిత్రులు ముత్యంరెడ్ది మరణం పార్టీకి, ఈ ప్రాంతానికి తీరని లోటని, వారు అనారోగ్యానికి గురైన సందర్భంలో ఎన్నో రకాలుగా కాపాడే ప్రయత్నం కేసీఆర్ చేశారన్నారని కేటీఆర్‌ అన్నారు.

Harish rao

ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలన్నారు. వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చాక రేపు ఉదయం ప్రభుత్వ లాంఛనలతో అంత్యక్రియలు జరుగుతాయని, ఆయన అంత్యక్రియల్లో పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనాలని కేటీఆర్ సూచించారు.

అలాగే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు చెరుకు ముత్యంరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ముత్యంరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.