నేడు సిరిసిల్లకు కేటీఆర్‌..

122
ktr in siricilla

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో కంటి ఆస్పత్రికి సంబంధించన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడి అధికారులతో జిల్లాలోని పరిస్థితులపై చర్చించనున్నారు.

ktr

కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో భాగంగా.. హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరి నేరుగా సిరిసిల్ల పట్టణానికి మంగళవారం చేరుకుంటారు. వేములవాడ నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న నూతన బస్సు సర్వీసును సిరిసిల్ల కొత్తబస్టాండ్ వద్ద సాయంత్రం 4గంటలకు ఆయన ప్రారంభిస్తారు.

అనంతరం అక్కడి నుంచి 4.30 గంటలకు బయలుదేరి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుంటారు. ఎల్ వి ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో రూ.10కోట్ల వ్యయం తో నిర్మించ తలపెట్టిన అధునాత కంటి వైద్యశాల పనులకు ఎమ్మెల్యే కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.