దేశానికే ఆదర్శంగా తెలంగాణ మున్సిపాలిటీలు: కేటీఆర్

149
ktr

తెలంగాణ మున్సిపాలిటీలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్‌ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఎన్నికల ప్రచార సరళి,అనుసరించాల్సిన వ్యూహాలపై పోటీ చేస్తున్న అభ్యర్థులు,పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను అభ్యర్థులకు వివరించిన కేటీఆర్ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

45 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు కేటీఆర్. నిజామాబాద్‌, సిరిసిల్ల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఎక్కువ ఉన్న బీడీ కార్మికులను ఆదుకునేందుకు పెన్షన్లు ఇస్తున్నాం అన్నారు.

పట్టణాల్లో విద్యుత్‌, మంచినీటి సమస్య లేకుండా చేశాం…. 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు. 75 గజాల ఇంటి స్థలం ఉన్నవారికి 22 రోజుల్లో అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 3వేల వార్డుల్లో పోటీ జరుగుతుంటే బీజేపీకి 1000 వార్డులు, కాంగ్రెస్‌కు 500 వార్డుల్లో అభ్యర్థులే లేరు… బీఫారాలు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకురాలేదన్నారు.