ఎన్నికల హామీ మేరకు పింఛన్ల పెంపు: కేటీఆర్

397
ktr siricilla
- Advertisement -

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేశామని తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. పెంచిన పింఛన్లను అర్హులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ బిడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

ఆదాయం పెంచాలి పేదలకు పంచాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. బతుకమ్మ చీరల బకాయిలతో పాటు వడ్డీలేని రుణాల నిధులు కూడా విడుదల కాబోతున్నాయని చెప్పారు. సిరిసిల్లలో 1500 ఇండ్ల నిర్మాణం పూర్తికావొచ్చిందని చెప్పారు.

దశాబ్దాలుగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యలను పరిష్కరించామని చెప్పిన కేటీఆర్ …17శాతం వృద్ధిరేటుతో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందన్నారు. పింఛను అర్హత వయసు తగ్గింపు కూడా జూన్‌ నెల నుంచే వర్తిస్తుందని…. బీడీ కార్మికులకు పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని తగ్గించడంతో కొత్తగా 2 లక్షల మందికి పింఛను అందుతుందన్నారు.

- Advertisement -