దేశం చూపు కాళేశ్వరం వైపు:కేటీఆర్

421
ktr siricilla
- Advertisement -

2001 ఏప్రిల్ 27న ప్రారంభమైన టీఆర్ఎస్‌ ఒక అజేయ శక్తిగా ఎదుగుతుందని ఎవరు ఉహించలేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ దేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపు చూస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూసి యావత్ దేశం నివ్వేర పోయిందన్నారు.

పార్టీ సంస్థగత నిర్మాణం జరగాలన్నదే కేసీఆర్ అభిమతమన్నారు. బూత్ కమిటీల నుంచి గ్రామ,మండల,జిల్లా స్ధాయి వరకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతామన్నారు. దేశం మొత్తం కాళేశ్వరం వైపే చూస్తోందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారని చెప్పారు. తెలంగాణలోని ప్రతీ జిల్లాలో  పార్టీ కార్యాలయాలను నిర్మించుకోబోతున్నామని చెప్పారు.

ఈ నెల 27 నుంచి పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తొలి సభ్యత్వం సీఎం కేసీఆర్ తీసుకుంటారని చెప్పిన కేటీఆర్…నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పండగలా టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమం జరగలాన్నారు. దసరా లోపు పార్టీ కార్యక్రమాలు ప్రారంభించుకుని జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు దేశ రాజకీయ పరిస్థితులను కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

టీఆర్ఎస్ ఆవిర్భావం ఓ చరిత్ర అని చెప్పిన కేటీఆర్..కేసీఆర్‌,టీఆర్ఎస్ తెలంగాణకు  శ్రీరామ రక్ష అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే గోదావరి,కృష్ణ నీళ్లు రావాలంటే ప్రజలందరు టీఆర్ఎస్‌ వైపు ఉండాలన్నారు. ప్రతీ ఇంట్లో-ప్రతీ గుండెలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పారు. సిరిసిల్లను సస్యశ్యామలం చేసే బాధ్యత తనదని చెప్పారు కేటీఆర్. పార్టీ కుటుంబసభ్యులందరు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లాలని చెప్పారు.

- Advertisement -