గ్రామగ్రామానికి వైకుంఠధామం: మంత్రి కేటీఆర్

380
ktr
- Advertisement -

పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారాయని తెలిపారు మంత్రి కేటీఆర్‌. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌ పంచాయతీ రాజ్ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నారు. సిరిసిల్ల జిల్లా అవుతుందని ఏనాడు ఎవరు అనుకోలేదన్నారు.

పాలనా సౌలభ్యం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. గిరిజనుల దశాబ్దాల కలను నెరవేర్చామని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని తెలిపారు.అభివృద్ధి,సంక్షేమ ఫలాలు అందరికి అందాలని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. త్వరలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ప్రారంభం కానుందని చెప్పారు.

ప్రజల ముందుకే సంక్షేమ ఫలాలు రావాల్సి ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు,మండలాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ నెల నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణ రూపురేఖలు మారుతాయని చెప్పారు.

తెలంగాణలో అధికార యంత్రంగా ప్రజలకు మరింత చేరువైందన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో మేథోమదనం చేసి పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చారని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్రంలో 12751 గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటుచేశామని తెలిపారు. గ్రామగ్రామానికి వైకుంఠధామం ఉండాలన్నారు. పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలన్నారు. సర్పంచ్‌లు పట్టుదలతో తమ గ్రామాలను ఆదర్శంగా తయారుచేసుకోవాలన్నారు.ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డులు ఉండాలన్నారు.

- Advertisement -