చిన్నారి ప్రాణాలు కాపాడిన మంత్రి కేటీఆర్‌..

491
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్‌ ట్విట్టర్ ద్వారా ఎవరైనా ఆపదలో ఉన్నట్లు తెలిస్తే వెంటనే స్పందించి వారికి తగిన సహాయాన్నిఅందిస్తూ ఉంటారు. ఎన్నోసార్లు సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన అభాగ్యుల ప్రాణాలను కాపాడి తన మానత్వాన్ని చాటుకున్నారు. అలాగే తాజాగా ఆపదలో ఉన్నామని, ఆదుకోవాలని ఓ యువకుడు చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ చిన్నారి వారం రోజుల క్రితం ప్రమాదవషాత్తు బిల్డింగ్‌పై నుంచి కింద పడింది.ఈ ఘటనలో చిన్నారి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే ఆ చిన్నారిని హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బాధితులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో.. చిన్నారి వైద్యానికి డబ్బులు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన ఓ యువకుడు.. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా ఈ చిన్నారి విషయాన్ని తెలియజేశారు. మెరుగైన చికిత్స కోసం ఆదుకోవాలని కోరాడు.

వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. చిన్నారి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించగా.. వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.3.50 లక్షలను అందజేశారు. తగిన సమయానికి చికిత్స అందించడంతో.. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉందని.. ట్విట్టర్‌లో పెట్టిన మా అభ్యర్థనను చూసి ఆదుకున్న మంత్రికి ధన్యవాదాలంటూ మళ్లీ ఆ యువకుడు ట్వీట్ చేశాడు. ఆ చిన్నారి చికిత్స పొందిన ఫోటోను కూడా జతచేశాడు. ఆ చిన్నారి ఫోటోను చూసిన కేటీఆర్.. “సోదరా.. ఈ రోజును పరిపూర్ణం చేశావు. చిన్నారికి సాయం చేయడం ఆనందంగా ఉంది” అంటూ తెలిపారు.

- Advertisement -