నల్లమలపై సీఎంతో చర్చిస్తాః మంత్రి కేటీఆర్

148
Ktr Nalamala

నల్లమల యురేనియం తవ్వకాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. యురేనియం తవ్వకాలతో అడవులను నాశనం చేయవద్దంటూ పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సేవ్ నల్లమల పేరుతో ఉద్యమాన్ని నడుపుతున్నారు. వీరికి సినీ ప్రముఖులు సైతం బాసటగా నిలుస్తున్నారు. యురేనియంతో పచ్చటి అడవులను నాశనం చేయొద్దని గళం విప్పుతున్నారు.

తాజాగా ఈనల్లమల యురేనియం తవ్వకాలపై స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. నల్లమల అడువుల్లో యురేనియం తవ్వకాలపై అందరూ తమ తమ ఆవేదనను తెలియపరుస్తున్నారని తాను రోజు ట్వీట్టర్ లో చూస్తున్నానని తెలిపారు. ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి చర్చిస్తామని తెలిపారు.