రైతు బిడ్డ…మండలి ఛైర్మన్‌: కేటీఆర్

406
ktr

శాసన మండలి చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు మంత్రి కేటీఆర్‌. 1971లో మేము పుట్టక ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు..డైరీ రంగంలో మీకు అపార అనుభవం ఉందన్నారు. డైరీరంగం మీకు ప్రీతి పాత్రమైంది..తెలంగాణ ఏర్పాటులో కూడా మీరు తెలంగాణ వాది అని సీఎం చెప్పేవారని చెప్పారు.

నిర్మల్ లోని ఎస్ఆర్ఎస్పీ వైశ్ణవాలయంలా తయారవుతుందని కేసీఆర్ చెప్పారు.ఆరోజు అన్న మాట ఈ రోజు సాకారం అయిందన్నారు. ఇవాళ మీరు అత్యున్నత పదవి అధిరోహించారు.. ఇది చెప్పుకోదగ్గ విశేషం.ఫ్లోరైడ్ సమస్యలపై శాసనసభ్యలకు మీరు ఇచ్చిన సందేశం ఎంతో విశేషంగా ఉంది.నక్కల గండి ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందన్నారు. అజాత శత్రువుగా అందరితో కలిసి మెలసి సభను నడపాలని కోరుతున్నానని చెప్పారు.

వ్యవసాయ మంత్రి గా ఉన్న పోచారం స్పీకర్ గా .. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడైన మీరు మండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు..ఇద్దరు రైతు బిడ్డలు అత్యున్నత హోదాలో ఉన్నారని చెప్పారు.

వార్డు నెంబర్ నుండి అత్యున్నత స్థాయికి ఎదిగారని గుత్తాపై ప్రశంసలు గుప్పించారు మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని చెప్పిన కేసీఆర్ మాటలు మీతో మరోమారు రుజువైంది..ఒకే జిల్లాలో ఉన్నా పరిచయం తక్కువే ..రైతుల విషయం వచ్చేసరికి అన్ని మరచి కలిసి పోరాడే వాళ్ళమని చెప్పారు. మండలి చైర్మన్ గా మీరు ఎన్నికవ్వడం రైతులకు కూడా శుభపరిణామం…
ఏకాభిప్రాయం తో ఉండే వాళ్ళం.. మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం ..ఆ స్థానంలో కూర్చున్నందుకు ఏదో కోల్పోయిన భావన ఉందన్నారు.. రెగ్యులర్ గా మీతో మాట్లాడేందుకు కలుస్తూ ఉంటా..ఈ సభకు మీరు వన్నెతెస్తారని భావిస్తున్నానని చెప్పారు.

మండలి చైర్మన్ గా ఎన్నికైన గుత్తాకు శుభాకాంక్షలు చెప్పారు తలసాని. ఈ పదవికి మీరు వన్నె తేస్తారు…సుదీర్ఘ రాజకీయ చరిత్ర మీకు ఉంది..నల్లగొండలోనే కాకుండా అనేక రంగాల్లో మీరు సేవలందించారు…సుదీర్ఘ కాలం కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది…మీరు మండలి చైర్మైన్ గా ఎన్నికవ్వడం మన అదృష్టం..మండలి కి విశేష సేవలందించాలని కోరుకుంటున్నానని చెప్పారు.

శాసనమండలి చైర్మన్ గా మిమ్మల్ని ఎన్నుకునే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మీ వ్యక్తిత్వానికి ఇది ఒక గౌరవం…వివాద రహితంగా.. అజాత శత్రువు గా అందరి మన్నలను పొందారు. తెలంగాణ ఏర్పాటు కోసం అంకిత భావంతో పనిచేశారు..
దీనికి యావత్ తెలంగాణ సమాజం సంతోషం వ్యక్తం చేస్తున్న తెలంగాణ బిల్లును పెట్టేందుకు మీరు స్పీకర్ పై తెచ్చిన ఒత్తిడి మరవలేనిదన్నారు. అధికార పార్టీ తరహాలోనే విపక్షాలకు చర్చించేందుకు అవకాశం కల్పించాలన్నారు.

అన్ని వ్యవస్థల్లో మీకు అపార అనుభవం ఉందన్నారు కడియం శ్రీహరి. మండలి క్యాతి పెరిగేలా విధులు నిర్వర్తిస్తారని భావిస్తున్నా.2001లో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్ ప్రాజెక్టు కోసం మీరు శ్రద్దతో నిధులు తెచ్చి పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నాం..నల్లగొండ పై ఉన్న ప్రేమ ఆనాడు నేను గమనించా,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు సహకరించమని చంద్రబాబు తో ఒత్తిడి చేసి మరీ తెలంగాణ కు అనుకూలంగా లేఖ ఇప్పించాం,రెండు కల్ల సిద్దాంతం.. రెండు నాల్కల ధోరణి నచ్చక ఇద్దరం బయటకు వచ్చాం,తెలంగాణ ఏర్పాటులో మీరు చేసిన సేవలు అమోఘమని చెప్పారు.