మిషన్ భగీరథకు 24 రూపాయలు కూడా ఇవ్వలేదు:కేటీఆర్,కవిత

377
ktr kavitha
- Advertisement -

కేంద్ర బడ్జెట్ పై గంపెడాశలు పెట్టుకున్న తెలంగాణకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌పై నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోథల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న కేంద్రం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర ఆర్ధికమంత్రికి ఇంట్రెస్ట్ లేదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ,మిషన్ కాకతీయలను నీతి అయోగ్ మెచ్చుకుందని అలాంటి ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని అడిగితే కనీసం 24 రూపాయలు కూడా కేటాయించలేదని ఎద్దేవా చేశారు కేటీఆర్.

బడ్జెట్ తీవ్రంగా నిరాశ పర్చిందన్నారు. ఎకనామిక్ సర్వే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశంసిస్తే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అవేమీ పట్టించుకోలేదన్నారు.

ఈసారి బడ్జెట్‌లో కూడా తెలంగాణకు నిరాశే మిగిలిందని మాజీ ఎంపీ కవిత మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి అన్నీ దక్కకపోవడం బాధాకరమన్నారమని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

- Advertisement -