మిషన్ కాకతీయపై నీతి అయోగ్ ప్రశంస:కేటీఆర్

454
Niti Aayog’s latest report
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ పథకం అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. తెలంగాణలో జలవనరుల పునరుద్ధరణ గొప్పగా జరిగిందని.. ఈ విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని ‘సమగ్ర నీటి యాజమాన్య సూచిక’ నివేదికలో వెల్లడించింది.
మిషన్‌ కాకతీయ అద్భుత పథకం..22 వేల చెరువులకు మహర్దశ వచ్చిందని నివేదికలో పేర్కొంది. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు 51.5 శాతం పంటల సాగు పెరిగిందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మిషన్ కాకతీయ పథకం కమీషన్ కాకతీయగా మారిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి..కానీ తాజాగా నీతి అయోగ్ నివేదికతో అవన్ని అవాస్తవాలే అని తేలిపోయాయని పేర్కొన్నారు.

నీతిఆయోగ్ నివేదికను విడుదల చేసిన కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మిషన్ కాకతీయ సాగుతున్న తీరుపై ప్రశంసలు కురిపించిందని వెల్లడించారు. తెలంగాణలో 22,500 చెరువులు పునరుద్ధరించామనీ, రాష్ట్రంలో చెరువులపై ఆధారపడి జరిగే సాగు 51.5 శాతం పెరిగిందని పేర్కాన్నారు. ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్.

- Advertisement -