కంటి ఆసుపత్రి భవనానికి కేటీఆర్ శంకుస్ధాపన

175
ktr

సిరిసిల్ల పట్టణంలో కంటి ఆసుపత్రి భవనానికి శంకుస్ధాపన చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ . ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ కంటి ఆస్పత్రి భవనాన్ని సరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో సిరిసిల్లతో కలిపి ఏడు సెంటర్లు ఉన్నాయి. సామాజిక బాధ్యతతో ఎంతో మంది ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇతరులు కూడా స్పూర్తి పొంది మంచి పనులు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కంటి వెలుగు దేశంలో ఎక్కడా జరగలేదు. కంటి వెలుగు పథకంతో పేదలకు కంటి పరిక్షలు చేయించామని తెలిపారు. సిరిసిల్లలో ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ కంటి ఆస్పత్రి ఏర్పాటు చేస్తుంన్నందుకు వారికి కృతజ్నతలు తెలిపారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ తో పాటు పలువురు అధికారులు పాల్గోన్నారు.