లాజిస్టిక్ పార్కును ప్రారంభించిన కేటీఆర్..

794
ktr
- Advertisement -

హెచ్ఎండీఏ – ఆన్‌కాన్ లాజిస్టిక్స్ కలిసి రూ.22 కోట్లతో మంగళ్‌పల్లి వద్ద ఏర్పాటుచేసిన లాజిస్టిక్‌ పార్క్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. దీంతో పాటు పెద్దఅంబర్‌పేట జంక్షన్ నుంచి బాట సింగారం వరకు రూ. 1.82 కోట్లతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర స్ట్రీట్ లైట్ల ఏర్పాటు పనులను ప్రారంభించారు.

22 ఎకరాల విస్తీర్ణంలో మంగళ్‌పల్లి అన్‌కాన్ లాజిస్టిక్ హబ్ రూపుదిద్దుకున్నది. మూడు ఎకరాల విస్తీర్ణంలో లక్షా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన గోదాం (వేర్‌హౌస్)నిర్మాణాన్ని ఆధునిక సౌకర్యాలతో పూర్తి చేశారు. ఎండాకాలంలో కూడా వేడిమిని తట్టుకుని చల్లదనాన్ని ఇచ్చేలా ఇన్స్‌లేషన్‌ను ఏర్పాటు చేశారు. లక్షల టన్నుల సరుకులు ఇక్కడ నిల్వ ఉండేలా భారీ గోడౌన్ నిర్మాణం పూర్తి కావడంతో దీని సేవలు గత నెల 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. వంద మంది డ్రైవర్లు ఒకేసారి విశ్రాంతి తీసుకునేందుకు నాలుగు విశాలమైన గదులను నిర్మించారు.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ట్రక్కులు, లారీల డ్రైవర్లు సేద తీరేందుకు విశ్రాంతి భవనంలో సకల సౌకర్యాలను కల్పించారు. లాజిస్టిక్ హబ్ సేవలు 30 జనవరి 2020 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నామని ఆన్‌కాన్ లాజిస్టిక్ హబ్ ఎండీ రాజశేఖర్ తెలిపారు.

- Advertisement -