సామజవరగమనా సాంగ్‌కి కేటీఆర్‌ ఫిదా

245
ktr thaman

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ముఖ్యంగా సినిమాలోని పాటలు అందరిచేత సామజవరగమనా అనిపించగా రాములో రాములా అనే పాటకు డ్యాన్స్ వేయని వారుండరు.

సామజవరగమనా సాంగ్‌ త‌న‌కి మ‌ర‌చిపోలేని అనుభూతిని మిగిల్చింద‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ సాంగ్ తనకి మంచి కంపెనీ ఇచ్చిందంటూ…చాలా అంద‌మైన సాంగ్‌ని స్వ‌ర‌ప‌ర‌చావు అని తమ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఈ సాంగ్ నా మ‌న‌స్సుకి ఎంతో హ‌త్తుకుందని పేర్కొన్నారు. అయితే కేటీఆర్ ట్వీట్‌కి వెంట‌నే స్పందించిన తమ‌న్ మీ కామెంట్‌తో మా సాంగ్ మ‌రింత సెన్సేష‌న్‌తో పాటు ప‌వ‌ర్‌ఫుల్‌గా మార‌నుంది అని అన్నారు.

https://twitter.com/KTRTRS/status/1219477765587640321/photo/1