మరోసారి పెద్ద మనసు చాటుకున్న కేటీఆర్..

519
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. అబుదాబిలో రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్యను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సోషల్ మీడియా ద్వారా వీరయ్య కష్టాలను తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించారు. వీరయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇచ్చారు.

వీడియోను కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, యూఏఈలో భారత రాయబారి నవదీప్ సూరి, అబుదాబిలో భారత ఎంబసీ అధికారులకు ట్యాగ్ చేస్తూ బాధితుడిని భారత్‌కు తీసుకురావాడానికి సాయం చేయాల్సిందిగా కోరారు. కేటీఆర్ విజ్ఞప్తికి స్పందించిన సుష్మా సౌదీలోని భారత రాయబార అధికారులతో మాట్లాడారు. వీరయ్యను స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయాలని కోరగా వారు వెంటనే స్పందించారు.దీంతో కేటీఆర్ భారత ఎంబసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

ktr twitter

కరీంనగర్ జిల్లాకు చెందిన పాలేటి వీరయ్య జీవనాధారం కోసం అబుదాబి వెళ్లాడు. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో ఒంటెలను కాసే పనిలో కుదిరాడు. రెండేండ్లుగా జీతం ఇవ్వకుండా, తిండి పెట్టకుండా వేధిస్తున్న యజమాని చేతిలో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీడియో ద్వారా తన గోడును వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేటీఆర్…వీరయ్యను భారత్‌కు తీసుకొచ్చేందుకు తనవంతు సహకారం అందించడంతో పాటు వారి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు.

- Advertisement -