రాష్ట్రంలోనే అగ్రగామిగా సిరిసిల్ల:కేటీఆర్

60
ktr siricilla

సిరిసిల్లను రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్. సిరిసిల్లలో బిడీ,నేత కార్మికులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కేటీఆర్ రాష్ట్రంలో ఇళ్లులేని వారు ఉండకూడదనేదే కేసీఆర్ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ కార్యదక్షత వల్లే 40 ఏళ్ల సిరిసిల్ల కార్మికుల కల నెరవేరిందన్నారు. జీవో నెంబర్ 58 ద్వారా 2 లక్షల 20 వేల మందికి పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

డబుల్ బెడ్‌రూమ్‌ల విషయంలో దళారుల మాటల నమ్మవద్దన్నారు. సిరిసిల్ల ప్రజల రుణం ఎన్నటికి తీర్చుకోలేనిదని చరిత్రలో ఎన్నడూలేని విధంగా 88 వేల మెజార్టీని అందించారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.సిరిసిల్ల పట్టణంలో రోడ్లు వేస్తామన్నారు.

రూ. 200 కోట్లతో సిరిసిల్లో అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామన్నారు. ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి తానే బ్యాంకు లోన్లు ఇప్పిస్తానని తెలిపారు. సిరిసిల్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలు అందిస్తామన్నారు. సిరిసిల్లో పేదరిక నిర్మూళనకు చర్యలు చేపట్టామన్నారు. సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరలతో వెలుగులు నింపామన్నారు. ఈ సందర్భంగా ఇళ్లులేని 3052 మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు కేటీఆర్.