దేశంలోనే మొదటిసారిగా కేటీఆర్‌కు వినూత్నంగా బర్త్ డే విషెస్..!

340
ktr news
- Advertisement -

టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ 43వ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం నాడు రాష్ట్రమంతటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఆయన అభిమానులు. ఇందులో భాగంగా..  టీఆర్‌ఎస్ పార్టీ కీర్తిని,అన్ని జిల్లా పరిషత్లపై గులాబీ జెండా ఎగిరెల చేసి పార్టీ ప్రతిష్టను పెంచి అన్ని తానై నడిపిస్తున్న యువ నేత, మన నాయకుడు.. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌)జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో 24 జులై,ఉదయం 9 గంటలకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది.

అన్ని జిల్లా, మండల కేంద్రాలలో చెట్లు నాటే కార్య్రమాన్ని నిర్వహించాలని, రోగులకు పండ్ల పంపిణీ, రక్త దాన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నాం.కావున విద్యార్థి నాయకులు, విద్యార్థులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు.

అలాగే కేటీఆర్‌ బర్త్ డే సందర్బంగా కూకట్పల్లికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకులు పాటిమీది జగన్మోహన్ రావు కార్యాలయంలో 2100 రూబిక్స్ క్యూబ్ లతో కేటీఆర్‌కి రూబిక్స్ క్యూబ్ పోర్ట్రైట్‌ను రూపొందించారు. ఇది రూపొందించడం మన భారతదేశంలో మొదటిసారి,కేటీఆర్‌కి వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపాలన్న ఆలోచనతో పాటిమీది జగన్మోహన్ రావు మేనల్లుడు కౌశిక్ మరియు అతని మిత్రుడు శరన్ గుప్తా లు 2 రోజులు శ్రమించి ఈ ఆర్ట్ ను రూపొందించారు.

ఇక కేటీఆర్‌ పుట్టిన రోజున ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దోమలగూడలోని భారత్ స్కౌట్స్‌ అండ్ గైడ్స్‌ మోడల్ హై స్కూల్‌లో నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్, మరియు పండ్ల పంపిణి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.

- Advertisement -