మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు అంత్యక్రియలకు కేటీఆర్..

134
Gattu Bhimudu Ktr

గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు నిన్న ఉదయం కన్నుముశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఉదయం నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భీముడి మృతి చెందడం పట్ల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు.

ఈసందర్భంగా నేడు భీముడు అంత్యక్రియల్లో పాల్గోననున్నారు కేటీఆర్. గట్టు మండలం బల్గెరా గ్రామంలో భీముని అంత్యక్రియలు జరుగనున్నాయి. 1999లో భీముడు టీడీపీ నుంచి గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు.మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్‌ నాయకుడిగా కొనసాగుతున్నారు.