దావోస్‌కు కేటీఆర్..

277
ktr

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్యూఇఎఫ్) ఆహ్వానం మేరకు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పారిశ్రామిక మంత్రి కే.తారకరామారావు శనివారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లనున్నారు.

జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు కేటీఆర్ . ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ సదస్సులో 4వ పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు ఎదురయ్యే సవాళ్లుపై ప్రసంగించనున్నారు కేటీఆర్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్రభాగాన ఎలా ఉందనే అంశాలను వివరించనున్నారు. దీంతోపాటు వివిధ అంశాలపైన జరిగే చర్చల్లోనూ తెలంగాణ ప్రభుత్వ అనుభవాలను వివరించనున్నారు కేటీఆర్.