హైదరాబాద్ ఫార్మా సిటీని మరింత అభివృద్ధి చేస్తాం..

218
KTR
- Advertisement -

హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో ఓడస్సి లాజిస్టిక్స్ రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైయ్యారు. మంత్రి నిరంజన్ రెడ్డి, ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

KTR

 

ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..

– తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం కూడా ఉందన్నారు.
– ప్రజా జీవితంలోకి రాకముందు నేను కూడా లాజిస్టిక్ కంపెనీలో పనిచేశాను.
– లాజిస్టిక్ రంగం మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
– వస్తువుల ఉత్పత్తి ఖర్చుతో కూడుకున్నది.
– ఎన్నో ఉత్పత్తులను ఎగుమతులు చేసుకోవాలి.
– ప్రపంచంలో 1/3 వ్యాక్సిన్ భారత దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది.
– వ్యాక్సిన్, మెడికల్ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారింది.
– భారత దేశ రోడ్డు, రైలు, వాయు మార్గాలు అభివృద్ధి చెందాయి.
– గూడ్స్ ను మూవ్ చేసుకోవాలంటే లాజిస్టిక్ రంగం కూడా అభివృద్ధి చెందాలి.
– గత 5 సంవత్సరాలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది.
– సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సరికొత్త భూ సేకరణ చట్టం తెచ్చాము.. అమలు చేసాం..
– ఐడెండ్లలో రెండు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు వచ్చాయి.
– హైదరాబాద్ చుట్టూ విశాలమైన ఔటర్ రింగ్ రోడ్డు ఉంది.
– ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలో డిసైడ్ చేసే స్థాయికి వచ్చాము.
– ఫార్మా రంగంలో కార్గో మూవ్ అనేది చాలా ముఖ్యం.
– రానున్న రోజుల్లో హైదరాబాద్ ఫార్మా సిటీని మరింత అభివృద్ధి చేస్తాం.
– దశాబ్దాలుగా ఉన్న ఫార్మా కంపనీలు ఎంతో ఉపాధి కల్పిస్తున్నాయి.
– డ్రై పోర్ట్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నాం.. ఇది లాజిస్టిక్ కంపెనీలకు ఎంతో ఉపయోగం.
– లాజిస్టిక్ రంగానికి రానున్న రోజుల్లో మంచి భూమ్ ఉంటుంది.
– హైదరాబాద్ లో కంపెనీ ని స్థాపించి రెండేండ్లలో ఎంతో ముందుకు సాగిన ఓడస్సి లాజిస్టిక్స్ కంపెనీకి అభినందనలు అని అన్నారు కేటీఆర్‌.

- Advertisement -