టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్..

249
ktr
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ని నియమించారు సీఎం కేసీఆర్. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం జాతీయ రాజకీయాలపై ప్రత్యేకదృష్టి సారించాలని భావిస్తున్న కేసీఆర్‌…కేటీఆర్‌కి కీలకబాధ్యతలు అప్పజెప్పారు. పార్టీ సభ్యత్వంతో పాటు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం,టీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలబెట్టే బాధ్యతను కేటీఆర్ కు అప్పజెప్పారు.

బంగారు తెలంగాణ సాధనలో తండ్రిబాటలో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు కేటీఆర్. యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తూ, ఐటీరంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. చేనేతకు అండగా, యువతకు స్ఫూర్తిగా నిలిచారు రామన్న. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో,తెలంగాణ తొలి సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తిరుగులేని మెజార్టీ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీ అభ్యర్థుల బాధ్యతను భుజాన వేసుకున్న కేటీఆర్‌…తనేంటో నిరూపించుకున్నారు.

Image result for ktr kcr

సిరిసిల్ల నియోజకవర్గం నుండి 2009లో అసెంబ్లీకి ఎన్నికైన కేటీఆర్ ప్రతీ ఎన్నికల్లో తన పనితీరుతో మెజార్టీని పెంచుకుంటు వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 90 వేల మెజార్టీతో విజయం సాధించారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ,ఉర్దూ భాషల్లో మంచిపట్టు ఉన్న కేటీఆర్ 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.

కేటీఆర్‌ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కేటీఆర్ సేవలు ఉపయోగపడుతాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -