దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందిః కేటీఆర్, కవిత

83
Ktr Kavitha Shiela Dikshit

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ఇవాళ మధ్యాహ్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమె ఇవాళ మధ్యాహ్నం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. షీలా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

తాజాగా షీలా దీక్షిత్ మృతి సంతాపం తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. భారతదేశం ఒక గొప్ప నేత కొల్పోయిందన్నారు కవిత. దేశంలోని గొప్ప లీడర్లలో షీలా దీక్షిత్ ఒకరు అన్నారు. షీలా దీక్షిత్ సక్సెస్ ఫుల్ లీడర్ అన్నారు కేటీఆర్. విజయవంతంగా 15సంవత్సరాలు ఢిల్లీ సీఎం గా పనిచేసిన గొప్ప నేత అన్నారు. ఈసందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

షీలా దీక్షిత్ మృతిప‌ట్ల రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ,ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, ఓమ‌ర్ అబ్దుల్లా, కాంగ్రెస్ పార్టీ త‌దిత‌రులు సంతాపం తెలిపారు. ఆమెకు రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు షీలా దీక్షిత్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్ బోధ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.