జిల్లాల్లో పార్టీ ఆఫీస్‌ల శంఖుస్థాపన ఘనంగా చేయాలి-కేటీఆర్‌

370
- Advertisement -

ఈ నెల 24న పార్టీ జిల్లా కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదేశించినట్టుగా 32 జిల్లా పార్టీ కార్యాలయాలకు 24న శంఖుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం అయా కార్యాలయాలను స్ధలాలను సైతం కేటాయించిందన్నారు. పార్టీ కార్యాలయాల నమూనాలు సైతం సిద్దంగా ఉన్నాయని, పార్టీ నుంచే కార్యాలయాల నిర్మాణంకు అవసరం అయిన నిధులు ఇవ్వనున్న నేపథ్యంలో త్వరితగతిన ఈ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్‌ తెలిపారు.

KTR

ఈ నెల 24న జరిగే శంఖుస్థాపన కార్యక్రమ నిర్వహాణ కోసం జిల్లాల వారీగా పార్టీ ప్రతినిధులను కేటీఆర్‌ నియమించారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మంత్రులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, మంత్రులు లేనిచోట్ల నూతనంగా ఎన్నికైన జిల్లా జడ్పీ చైర్మన్లు ఈ శంఖుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటల మద్యలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్ధల ప్రతినిధులు, పార్టీ సినియర్ నాయకులు హజరు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కోరారు. 24న సిరిసిల్లాలో జిల్లా జడ్పీ చైర్మన్ అరుణ నిర్వహించే శంఖుస్థాపన కార్యక్రమానికి కేటీఆర్‌ హజరవుతారు.

జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాలకు శంఖుస్ధాపన చేసే వారి వివరాలు..

అసిఫాబాద్- కోవా లక్ష్మి, మంచిర్యాల –భాగ్యలక్ష్మి, ఆదిలాబాద్- జనార్దన్ రాథోడ్, నిర్మల్- అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, నిజామాబాద్- వేముల ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి- ధాపేధార్ శోభ, జగిత్యాల- కొప్పుల ఈశ్వర్, సిరిసిల్ల- అరుణ, కరీంనగర్- ఈటల రాజేందర్, పెద్దపల్లి- పుట్టమధు, జయశంకర్ భూపాలపల్లి- శ్రీ హర్షిని, మహబూబాబాద్- అంగోత్ బిందు, ములుగు- కుసుమ జగదీష్, జనగాం- ఎర్రబెల్లి దయాకర్ రావు, భద్రాద్రి కొత్తగూడెం- కోరం కనకయ్య, సూర్యాపేట- జగదీష్ రెడ్డి, నల్లగొండ- బండా నరేందర్రెడ్డి, యాదగిరి భువనగిరి- సందీప్ రెడ్డి, సిద్దిపేట-రోజా శర్మ, మెదక్-హేమలత, సంగారెడ్డి- పటోల్ల మంజుశ్రీ, రంగారెడ్డి-తీగల అనితా, వికారాబాద్- పట్నం సునీత రెడ్డి, మేడ్చల్- మల్లా రెడ్డి, మహబూబ్ నగర్- శ్రీనివాస్ గౌడ్, నారాయణపేట- వనజమ్మ, నాగర్కర్నూల్- పద్మావతి, వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జోగులాంబ గద్వాల్- శ్రీమతి సరిత.

- Advertisement -