రివ్యూ : కౌసల్య కృష్ణమూర్తి

613
kousalya krishnamurthi review

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌’. త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకున్న క‌ణ మూవీని ఇప్పుడు కౌస‌ల్య కృష్ణ‌మూర్తిగా తెలుగులోకి తీసుకొచ్చారు. కౌసల్య కృష్ణమూర్తి ఎలా ఉంది…? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి.

కథ:

కృష్ణ‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) ఓ రైతు. వ్య‌వ‌సాయంతో పాటు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. భారత్ ఓడిపోతే అస్సలు తట్టుకోలేడు. తండ్రిని చూసి క్రికెట్‌పై మక్కువ పెంచుకుంటుంది కౌసల్య (ఐశ్వ‌ర్య రాజేష్‌). భారత్ తరపున ఆడి తండ్రి కళ్లలో ఆనందం చూడాలనుకుంటుంది కానీ అమ్మ (ఝాన్సీ)కి ఇష్టం ఉండదు. దీనికి తోడు ఊర్లో వాళ్లందరు ఎగతాలి చేస్తుంటారు..సీన్ కట్ చేస్తే వాటన్నింటినీ తట్టుకొని భారత జట్టులో చోటు ఎలా సంపాదించుకుంది…?ఈ క్రమంలో కౌసల్య పడిన కష్టాలు ఏంటనేది తెరమీద చూడాల్సిందే.

Aishwarya Rajesh

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ క‌థ‌, క‌థ‌నం,సెంటిమెంట్,శివ కార్తికేయన్ నటన. క‌ణ‌లో క్రికెట‌ర్‌గా న‌టించిన ఐశ్వ‌ర్య రాజేష్‌ తెలుగులో అదరగొట్టింది. క్రికెటర్‌గా కనిపించడానికి కష్టపడింది. రాజేంద్ర ప్ర‌సాద్ నటన సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లింది. తన నటన అనుభవాన్ని జోడించి తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. మిగితా నటీనటుల్లో ఝాన్సీ,శివ కార్తికేయ‌న్ సూపర్బ్. ముఖ్యంగా శివ కార్తికేయ‌న్ న‌ట‌న‌ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌.

మైనస్ పాయింట్స్‌ :

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ తెలుగు నేటివిటికి తగ్గట్టుగా లేకపోవడం, రీమేక్‌లో ఎలాంటి మార్పులూ చేయ‌క‌పోవ‌డం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది. రైతుల గురించి చెప్పిన డైలాగులు చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి. క‌థ‌లో మార్పులు చేర్పులు చేయ‌డానికి ద‌ర్శ‌కుడు ఏమాత్రం సాహ‌సం చేయ‌లేక‌పోయాడు. పాట‌లు,సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా వ‌ర్క్ ఆక‌ట్టుకుంటుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for కౌసల్య కృష్ణమూర్తి

తీర్పు :

క్రికెట్,రైతు సమస్యల నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. ఓ అమ్మాయి క్రికెట‌ర్‌గా ఎదిగే తీరు, ఓ రైతు ప‌త‌నం ఈ రెండు ఒకే క‌థ‌లో ఇమిడ్చి, చివ‌ర్లో రైతుల్ని బ‌తికించండి, రైతుల్ని అప్పుల పాలు చేయొద్దు అంటూ సందేశం ఇచ్చిన వైనం అంద‌రికీ న‌చ్చుతుంది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో సూర్తినిచ్చే మూవీ కౌసల్య కృష్ణమూర్తి.

విడుదల తేదీ: 23/08/2019
రేటింగ్ :2.75/5
నటీనటులు: ఐశ్వర్య రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌
సంగీతం: దిబు నిన్నాన్‌ థామస్‌
నిర్మాత: కేఎ వల్లభ
దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు