ఫిరోజ్‌ షా కోట్ల..ఇకపై జైట్లీ స్టేడియం

531
jaitly stadium
- Advertisement -

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్డేడియం పేరు ఇక మారనుంది. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ స్మారకార్థం కోట్ల స్టేడియానికి ఆయన పేరుపెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం(డీడీసీఏ) నిర్ణయించింది.

రాజకీయాలతో పాటు బీసీసీఐలోనూ కీలక పదవులు చేపట్టారు జైట్లీ. డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేగాదు క్రికెట్‌ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో కృషి చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ కోట్లా స్టేడియంలో మౌలిక సదుపాయాలు,స్టాండ్ల నిర్మాణం జైట్లీ ఆధ్వర్యంలో జరిగాయని చెప్పారు. అందుకే ఈ స్టేడియానికి జైట్లీ పేరు పెట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు ముఖ్య అతిథులుగా రానున్నారని చెప్పారు. స్టేడియానికి పేరు పెట్టే కార్యక్రమానికి కోట్లాలో ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరు పెట్టనున్నామని వెల్లడించారు.

అరుణ్‌ జైట్లీ ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహంతోనే ఈనాటి విరాట్‌ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్ గంభీర్, ఆశిష్‌ నెహ్రా, రిషబ్ పంత్ సహా చాలా మంది ఆటగాళ్లు దేశం గర్వపడేలా క్రికెట్ ఆడుతున్నారని చెప్పారు.

- Advertisement -