టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న కోల్ కత్తా..

254
David-Warner
- Advertisement -

ఐపిఎల్ 12 వ సీజన్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన బెంగుళూరు, చైన్నై మ్యాచ్ లో చైన్నై ఘన విజయం సాధించింది. ఇవాళ కోల్ కత్తా వర్సెస్ హైదరబాద్ మ్యాచ్ జరుగనుంది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈమ్యాచ్ లో గెలుపుపై ఇరు జట్లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్న ఈమ్యాచ్ లో టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది కోల్ కత్తా.

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ భుజం గాయం కారణంగా మొదటి మ్యాచ్ కు  దూరమయ్యాడు . నేపథ్యంలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈమ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈమ్యాచ్ తో ఐపీఎల్‌లో భువనేశ్వర్ తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక సొంత గడ్డపై ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు కోల్ కత్తా టీం కెప్టెన్ దినేష్ కార్తీక్.

- Advertisement -