రాజస్తాన్‌పై కోల్‌కతా విజయం..

284
KKR
- Advertisement -

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అద్భుత విజయం.. కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముందుగా రాజస్తాన్‌ను కట్టేసింది. వికెట్లున్నా పరుగుల్ని నిరోధించింది. తర్వాత సులభ లక్ష్యాన్ని వేగంగా ఛేదించింది. మందకొడి పిచ్‌పై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. లీగ్‌లో నైట్‌రైడర్స్‌ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మొదట రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 13.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసి గెలిచింది.

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: రహానె ఎల్బీ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 5; బట్లర్‌ (సి) శుభ్‌మన్‌ (బి) గార్నీ 37; స్టీవ్‌ స్మిత్‌ నాటౌట్‌ 73; త్రిపాఠి (సి) చావ్లా (బి) గార్నీ 6; స్టోక్స్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 139; వికెట్ల పతనం: 1-5, 2-77, 3-105; బౌలింగ్‌: చావ్లా 4-0-19-0; ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-35-1; నరైన్‌ 4-0-22-0; కుల్‌దీప్‌ 4-0-33-0; గార్నీ 4-0-25-2

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: లిన్‌ (సి) మిథున్‌ (బి) గోపాల్‌ 50; నరైన్‌ (సి) స్మిత్‌ (బి) గోపాల్‌ 47; ఉతప్ప నాటౌట్‌ 26; శుభమన్‌ గిల్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (13.5 ఓవర్లలో 2 వికెట్లకు) 140; వికెట్ల పతనం: 1-91, 2-114; బౌలింగ్‌: ధవళ్‌ కులకర్ణి 3-0-31-0; గౌతమ్‌ 1-0-22-0; ఆర్చర్‌ 3-0-14-0; గోపాల్‌ 4-0-35-2; మిథున్‌ 2-0-27-0; స్టోక్స్‌ 0.5-0-3-0

- Advertisement -