కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌ లో శ్యామ్‌ సింగరాయ్‌!

499
nani
- Advertisement -

ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు నాచురల్ స్టార్ నాని. మూడు సినిమాల్లో ఒకటి వి కాగా మిగితా రెండు టక్ జగదీష్,శ్యామ్ సింగ రాయ్‌. ఇందులో ఇప్పటికే వి సినిమా షూటింగ్ పూర్తికాగా టక్ జగదీశ్‌ షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇక మూడో సినిమా శ్యామ్ సింగరాయ్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభంకానుంది. టాక్సీ వాలా వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. బెంగాలి బాబుగా నాని కనిపించనున్నారట. 2020 డిసెంబర్ 25న సినిమా విడుదల కానుండగా ‘నాని’ కి ఇది 27 వ చిత్రం.

- Advertisement -