కోహ్లీ జీతం ఎంతో తెలుసా..!

220
Kohli's salary from BCCI may jump from Rs.5 crore to Rs.10 crore
- Advertisement -

భారత అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్ల జీతాలు రెట్టింపు కానున్నాయి! ప్రస్తుతమున్న వేతన విధానానికి అదనంగా మరో రూ.200 కోట్లను చేర్చేలా సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ త్వరలో బీసీసీఐకి ప్రతిపాదించనుందని సమాచారం. ఇందుకు బీసీసీఐ ఆమోదం తెలిపితే క్రికెటర్ల జీతాల కోసం కేటాయిస్తున్న మొత్తం రూ.180 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరుతుంది. పాలకుల కమిటీ కసరత్తు జరిపిన విధానంలో సీనియర్‌, జూనియర్‌ క్రికెటర్లకు జీతాలు పెంచుతారు.

Kohli's salary from BCCI may jump from Rs.5 crore to Rs.10 crore

జీతాలు పెంచాలని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, సారథి విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్‌ పాలకులను కలిసి రెండు వారాల క్రితం నివేదిక ఇచ్చారు. అంతకుముందు మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే సైతం ఆటగాళ్లు, శిక్షణ సిబ్బంది వేతనాలను భారీగా పెంచాలని కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ రాబడిలో 26 శాతం వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెటర్లకు 13 శాతం, దేశవాళీ క్రికెటర్లకు 10.6 శాతం, మహిళలు, జూనియర్లకు 2.4 శాతం ఇస్తున్నారు.

పాలకుల కమిటీ ప్రతిపాదనకు బీసీసీఐ ఆమోదం తెలిపితే క్రికెటర్ల వేతనాలు రెట్టింపు పెరుగుతాయి. సారథి విరాట్‌ కోహ్లీ జీతం రూ.10 కోట్లకు పెరుగుతుంది. 2017లో అతను 46 మ్యాచ్‌ల ద్వారా రూ.5.51 కోట్లు ఆర్జించాడు. రంజీ ఆటగాళ్ల జీతం 15 లక్షల నుంచి 30 లక్షలకు పెరుగుతుంది. అంతర్జాతీయ, దేశవాళీ ఆటగాళ్ల జీతాల పెరుగుదల శాతం దాదాపు ఒకేలా ఉంటుందని కొన్ని వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -