డీఆర్ఎస్,పంత్ కొంపముంచారు..!

283
india vs australia
- Advertisement -

కర్ణుడి చావుకి వంద కారణాలు అనేది ఎంతనిజమో ఆసీస్‌తో జరిగిన నాలుగోవన్డేలో టీమిండియా ఓటమికి అన్నే కారణాలుగా చెప్పుకొవచ్చు. భారీ లక్ష్యాన్ని విధించిన ఆ టార్గెట్‌ని కాపాడుకోలేక పోయింది టీమిండియా. బౌలింగ్,ఫీల్డింగ్ వీటికి తోడు డీఆర్ఎస్‌ ఫలితంగా కోహ్లీ సేన ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో చాలా బాధేస్తోందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ తమ ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్‌ బాగా లేదు. డీఆర్‌ఎస్‌ను సందేహించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అస్టన్‌ టర్నర్‌, ఖవాజా, హ్యాండ్స్‌కోంబ్‌ల అద్భుతంగా ఆడారని కితాబిచ్చారు.

టీమిండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ప్రత్యామ్నాయంగా ఉన్న రిషబ్ పంత్‌ స్టంప్‌లు,క్యాచ్‌లు జారవిడవడంతో భారత్ మ్యాచ్‌ చేజేతులా జార్చుకుంది. సోషల్ మీడియాలో పంత్‌పై మండిపడుతున్నారు. పంత్‌కు ధోనికి అసలుపోలీకే లేదంటూ ఫన్నీ సెటైర్లు విసురుతున్నారు. ఇక మరోవైపు మ్యాచ్‌ విన్నర్ టర్నర్ క్యాచ్‌ ఔటైనా భారత్‌ స్టంపు కోసం రివ్యూ కోరడంతో డీఆర్ఎస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆసీస్ విన్నింగ్‌లో కీలకపాత్ర పోషించారు టర్నర్‌.ఆస్టన్‌ టర్నర్‌ (43 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి జట్టును గెలిపించాడు.సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఐదో వన్డే బుధవారం న్యూఢిల్లీలో జరగనుంది.

- Advertisement -