ధోనిలా కీపింగ్..కష్టమే: రాహుల్

277
kl rahul
- Advertisement -

మహేంద్రసింగ్ ధోని తర్వాత భారత జట్టులో కీపర్‌గా ప్రధానంగా వినిపిస్తున్న పేరు కేఎల్ రాహుల్. పలువురు మాజీ ఆటగాళ్లు సైతం రాహుల్‌ ప్రత్యామ్నాయం అని సూచిస్తుండగా తన కీపింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్.

ధోనీ నుండి కీపింగ్ బాధ్యతలు తీసుకోవడం అంత సులువుకాదన్నాడు. ధోని స్ధాయి అంచనాలు తట్టుకుని కీపింగ్ చేయాలంటే కష్టమేనని.. కీపర్ గా ఉన్నంతసేపు భయంగా ఉంటుందన్నారు.

ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం, లెజెండ్ వికెట్ కీపర్ స్థానాన్ని చేరుకోవడం కష్టమేనని స్పష్టం చేశాడు. ఐపీఎల్ కు ఆడినప్పుడు కీపింగ్ గ్లౌజులు వేసుకున్నానని జట్టుకు నా అవసరం ఉంది కాబట్టే కీపింగ్ చేస్తున్నా అని తెలిపాడు.

- Advertisement -