ఐపీఎల్ 10 : హైదరాబాద్ ఔట్

206
- Advertisement -

ఐపీఎల్‌ – 10లో హైదరాబాద్ సన్ రైజర్స్ పోరు ముగిసింది. సన్ రైజర్స్ ఫైనల్ ఆశలకు గండికొట్టాడు వరణుడు. వర్షం కారణంగా మూడు గంటలు ఆలస్యంగా తేలిన ఫలితంలో.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ముగిశాక వర్షం మూడు గంటలకు పైగా అంతరాయం కలిగించింది.

తర్వాత కోల్‌కతా లక్ష్యాన్ని డ/లూ పద్ధతి ప్రకారం 6 ఓవర్లలో 48 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 5.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్లోనే లిన్‌ (6), యూసుఫ్‌ పఠాన్‌ (0) వరుస బంతుల్లో ఔటవడం.. రెండో ఓవర్లో ఉతప్ప (1) కూడా వెనుదిరగడంతో సన్‌రైజర్స్‌లో ఆశలు మొలిచినా.. గంభీర్‌ (32 నాటౌట్‌; 19 బంతుల్లో 2×4, 2×6) ధాటిగా ఆడి కోల్‌కతాను గెలిపించాడు.

KKR survive rain scare in 1.27am finish

పిచ్‌ బ్యాటింగ్‌కు కష్టంగా ఉండటం, కోల్‌కతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట సన్‌రైజర్స్‌ పరుగులు చేయడానికి చాలా శ్రమించింది. సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌ చేరడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నరే.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. 37 పరుగులతో (35 బంతుల్లో 2×4, 2×6) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.  విలియమ్సన్‌ (24; 26 బంతుల్లో 2×4, 1×6) ,యువరాజ్‌ సింగ్‌ (9) ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. చివరి ఓవర్లో సన్‌రైజర్స్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో సన్‌రైజర్స్‌  ఆశలు ఆవిరయ్యాయి. విజయ్‌ శంకర్‌ (22; 17 బంతుల్లో 2×4, 1×6), నమన్‌ ఓజా (16; 16 బంతుల్లో 1×6) కాస్త పోరాడటంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చివరి ఓవర్లో రెండు బంతులుండగానే వరుణుడి ప్రతాపం మొదలైంది. హడావుడిగా ఆ రెండు బంతులు కానిచ్చి ఆటగాళ్లు, అంపైర్లు పరుగు పరుగున మైదానాన్ని వీడారు.

- Advertisement -