సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ గెలుపు..

23

ఐపీఎల్‌–12లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా మరో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌లో ధాటిగా పరుగులు చేయలేకపోయింది. తర్వాత బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టులో నాలుగే వికెట్లు పడేసింది. చివరకు సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యా టింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి విజయం సాధించింది.

Kings XI Punjab

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ నాటౌట్‌ 70; బెయిర్‌స్టో (సి) అశ్విన్‌ (బి) ముజీబ్‌ రెహ్మాన్‌ 1; విజయ్‌ శంకర్‌ (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 26; నబి రనౌట్‌ 12; పాండే (సి) నాయర్‌ (బి) షమి 19; హుడా నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 8;
మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 150
వికెట్ల పతనం: 1-7, 2-56, 3-80, 4-135
బౌలింగ్‌: రాజ్‌పుత్‌ 4-0-21-0; ముజీబ్‌ రెహ్మాన్‌ 4-0-34-1; షమి 4-0-30-1; అశ్విన్‌ 4-0-30-1; కరన్‌ 4-0-30-0

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ నాటౌట్‌ 71; గేల్‌ (సి) హుడా (బి) రషీద్‌ 16; మయాంక్‌ (సి) శంకర్‌ (బి) సందీప్‌ 55; మిల్లర్‌ (సి) హుడా (బి) సందీప్‌ 1; మన్‌దీప్‌ (సి) హుడా (బి) కౌల్‌ 2; కరన్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 1
మొత్తం: (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 151
వికెట్ల పతనం: 1-18, 2-132, 3-135, 4-140
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-25-0; సందీప్‌ శర్మ 4-0-21-2; రషీద్‌ ఖాన్‌ 4-0-20-1; మహ్మద్‌ నబి 3.5-0-42-0; సిద్దార్థ్‌ కౌల్‌ 4-0-42-1