చెన్నైకి పంఛ్‌ ఇచ్చిన పంజాబ్‌..

23
Kings XI Punjab

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై కింగ్స్‌ XI పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. తర్వాత బరిలో దిగిన పంజాబ్.. 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 71 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. క్రిస్‌గేల్ 28 పరుగులు చేసి రాహుల్‌కు మంచి జోడినందించాడు. 71 పరుగులు చేసిన రాహుల్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫా డు ప్లెసిస్‌(96; 55 బంతుల్లో 10×4, 4×6) ధాటిగా ఆడి త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌రైనా(53; 38 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకంతో మెరిశాడు. ఆదిలోనే షేన్‌వాట్సన్‌(7) ఔటవ్వడంతో వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రైనా అర్ధశతకం తర్వాత ఔటవ్వగా కాసేపటికే డు ప్లెసిస్‌ పెవిలియన్‌ చేరాడు. ఆఖరి నాలుగు ఓవర్లలో చెన్నై నాలుగు వికెట్లు కోల్పోవడంతో 170 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌కరన్‌ మూడు, మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీశారు.