రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘మ‌న్మ‌ధుడు2’..

231
king rahul
- Advertisement -

కింగ్ నాగార్జున త‌న‌దైన స్టైల్లో క‌థ‌లు ఎంచుకుంటూ యువ హీరోల‌కు ధీటుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. దాదాపు 60ఏళ్ల వ‌య‌సుకు వ‌చ్చిన ఇంకా అమ్మాయిల ఫాలోయింగ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఇటివ‌లే ఆయ‌న న‌టించిన దేవ‌దాస్ సినిమా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఈసినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా పెద్ద వ‌సూళ్లు రాబ‌ట్ట‌క‌పోయినా నాగార్జున నట‌న‌కు మాత్రం మంచి మార్కులే వ‌చ్చాయి..

manmadudu
ఇక నాగార్జున కెరీర్లో చెప్పుకోద‌గిన సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో ఒక‌టి మ‌న్మ‌ధుడు. విజ‌య్ భాస్క‌ర్ ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2002లో ఈసినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికి ఈమూవీ టీవిల్లో వ‌స్తుంటే చాలా మంది చూస్తుంటారు. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం నాగార్జున‌ మ‌న్మ‌ధుడు2 సినిమాను చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

king

యువ హీరో ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. రాహుల్ ఇటివ‌లే నాగార్జున‌కు స్టోరీ వినిపిపించినట్లు స‌మాచారం. స్టోరీ విన్న నాగార్జున వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. జ‌న‌వ‌రి నుంచి ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రాంర‌భంకానుంద‌ని స‌మ‌చారం.

- Advertisement -