మొక్కలు నాటిన కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్

160
grrenindia

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పెరియాల రవీందర్ రావు మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్బంగా కిమ్స్ కాలేజీ అఫ్ లా లో మూడు మొక్కలు నాటారు రవీందర్ రావు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయి మొక్కలు నాటాలని కోరారు. తాను కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు, డీసీఎంస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నర్సింగాపూర్ సర్పంచ్ ప్రేమ్ సాగర్ రావు, కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామ రావు పాల్గొన్నారు.