మహోద్యమంలా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్..

305
- Advertisement -

నేలంతా పచ్చగా ఉంటే.. మనుషులంతా చల్లగా ఉంటారనే సీఎం కేసీఆర్ మాటలతో స్పూర్తిపొంది.. గత యేడాది ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం నేడు మహోద్యమంలా సాగుతోందని టీయూడబ్ల్యూజె రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమం రోజు రోజుకు విస్తరిస్తూ.. కోట్లాది హృదయాలను కదిలించడం గొప్ప పరిణామం అన్నారు.

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఖమ్మంలో జర్నలిస్టులు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్‌లోని ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్ వద్ద మొక్కలు నాటారు. అనంతరం వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి సంరక్షించారు.

Green Challenge in khammam

యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. కాలుష్య కాసారాలుగా మారుతున్న భూ ప్రపంచంలో హరిత వనం సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక్కో మనిషి ఒక మొక్క నాటి సంరక్షిస్తే.. సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో టెమ్ జూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేందర్, ఖదీర్, నాయకులు సాంబశివరావు, ప్రశాంత్ రెడ్డి, విజేత, రామకృష్ణ, టీవీజేఏ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, యాకూబ్ పాష, టీయూడబ్ల్యూజే నాయకులు వడ్డే రామారావు, గుద్దేటి రమేష్, సత్యనారాయణ, ఈశ్వరి, కేవీ, రాజేంద్ర ప్రసాద్, అప్పలరాజు, యూసుఫ్ షరీఫ్, పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.

Khammam Journalists Planted Saplings has accepted the Green Challenge thrown at him by TRS MP J Santosh Kumar. On Monday..

- Advertisement -